వైభవంగా ‘మాంజ’ ఆడియో లాంచ్!

వైభవంగా ‘మాంజ’ ఆడియో లాంచ్!

Published on Nov 2, 2015 10:05 PM IST

manja
కిషన్ ఎస్.ఎస్. ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కన్నడ సినిమా ‘కేరాఫ్ ఫుట్‌పాత్ 2’. తెలుగులో ఈమధ్య కాలంలో పాపులర్ అయిన హీరోయిన్ అవికా గోర్, దీప్ పఠక్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను గిరిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి తెలుగులో ‘మాంజ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు.

ఈ ఆడియో లాంచ్‌కు మాంజ టీమ్‌తో పాటు సినీ దర్శకుడు రాజ్ కందుకూరి, మల్టీ డైమెన్షన్ వాసు, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు విచ్చేసి సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఓ రియలిస్టిక్ సంఘటనల ఆధారంగా చేసుకొని రూపొందిన ఈ సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని మాంజ టీమ్ ఈ సందర్భంగా తెలిపింది. ఇక ఆస్కార్ అవార్డుకు ఇండియా తరపున లేటరల్ ఎంట్రీ స్కీమ్‌లో భాగంగా మాంజ సినిమాను పరిశీలనలో ఉంచారని గిరిధర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

తాజా వార్తలు