‘మన్మథుడు 2’ లేటెస్ట్ అప్డేట్ !

Published on Feb 15, 2019 1:13 pm IST


కింగ్ నాగార్జున ‘దేవదాస్’ తరువాత కొంత గ్యాప్ తీసుకొని తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ ‘మన్మథుడు 2 ‘ చిత్రంలో నటించనునున్నాడు. ఈచిత్రం మార్చి 12న అధికారికంగా లాంచ్ కానుందని సమాచారం. ఈ చిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ యూరప్ లో జరుగనుంది. దాదాపు రెండు నెలలు ఈ చిత్రం కోసం నాగార్జున అక్కడే ఉండనున్నారని సమాచారం. అయితే ఈచిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారో తెలియాల్సి వుంది.

ఇక నాగార్జున కెరీర్ లో కల్ట్ సినిమా గా మిగిలిన సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’ కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది ఈచిత్రం. దాంతో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈసీక్వెల్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :