ఎట్టకేలకూ ‘మన్మథుడు 2 ‘ మొదలయ్యాడు !

Published on Mar 25, 2019 4:58 pm IST

ఎప్పటినుంచో అనుకుంటున్న.. నాగ్ సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ ‘మన్మథుడు 2 ‘ ఎట్టకేలకూ ఈ రోజు ప్రారంభం అయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని అమల ఫస్ట్ క్లాప్ కొట్టగా.. నాగ చైతన్య కెమెరా స్వీచ్ ఆన్ చేశారు. ఈ ప్రారంభోత్సవంలో చిత్రబృందం మొత్తం పాల్గొంది.

ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం చిత్రబృందం ఐరోపాకు వెళ్లనుంది. ఇక రాహుల్ రవీంద్రన్ రాసిన స్క్రిప్ట్ చాలా బాగుందని కామెడీ విషయంలో చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్.

సంబంధిత సమాచారం :