కింగ్ నాగార్జున, ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన్మథుడు 2 చిత్రం యొక్క షూటింగ్ ఈనెల 28 హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇక తాజాగా ఈషెడ్యూల్లో రైజింగ్ కమెడియన్ వెన్నల కిషోర్ జాయిన్ అయ్యారు. ఆయన పాత్ర హిలేరియస్ గా ఉండనుందని సమాచారం.
ఈ షెడ్యూల్ తరువాత మేజర్ పార్ట్ షూటింగ్ అంతా యూరప్ లో జరుగనుంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. నాగ్ -రకుల్ కలిసి నటించడం ఇదే మొదటిసారి.
అల్ టైం సూపర్ హిట్ మూవీ మన్మథుడు కి సీక్వెల్ రానున్న ఈ చిత్రాన్ని మనం ఎంటర్ ప్రైజెస్ , ఆనంది అర్స్ క్రియేషన్స్ బ్యానర్లపై నాగార్జున , కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


