‘మ‌న్మ‌థుడు 2’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Jul 21, 2019 4:29 pm IST

కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. కాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా జూలై 25న `మ‌న్మ‌థుడు 2` థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నాగార్జున తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. వచ్చే వారం కల్లా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయట. కాగా ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుద‌ల‌ను త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాల పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :