ఏప్రిల్ నుండి మనోజ్ కొత్త సినిమా !

ఏప్రిల్ నుండి మనోజ్ కొత్త సినిమా !

Published on Feb 26, 2018 12:43 PM IST

మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరువాత కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ‘నేనోరకం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుదర్శన్ సలేంద్రతో మనోజ్ సినిమా త్వరలో ప్రారంభంకానుందని సమాచారం. డైరెక్టర్ సుదర్శన్ చెప్పిన పాయింట్ నచ్చడంతో మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ ఆఫిసియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.

నూతన నిర్మాతలు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఏప్రిల్ నెలలో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల విడుదలైన తరుణ్ ‘ఇదినా లవ్ స్టోరి’ సినిమాలో మనోజ్ గెస్ట్ రోల్ లో కనిపించిన మనోజ్ శ్రీకాంత్ నటించిన ‘ఆపరేషన్ 2019’ సినిమాలో కూడ అతిధి పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు