సుధీర్ బాబు సినిమాలో మనోజ్ గెస్ట్ రోల్

సుధీర్ బాబు సినిమాలో మనోజ్ గెస్ట్ రోల్

Published on Apr 12, 2015 9:50 AM IST

manoj-manchu-sudeer-babu
మంచు వారబ్బాయి మంచు మంచు మనోజ్ ప్రస్తుతం విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అటాక్ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది. అంటే కాకుండా మనోజ్ లక్ష్మీ మంచు నటించిన ‘దొంగాట’ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసాడు. ఇది కాకుండా తాజాగా మంచు మనోజ్ మరో సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేసాడు.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు చేసిన లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఈ సినిమాలో మంచు మనోజ్ ఓ అతిధి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలోని ఓ సీక్వెన్స్ లో బాగా ఇంటెన్స్ ఉన్న యంగ్ హీరో చేస్తే బాగుంటుంది అని భావించిన ఈ చిత్ర టీం మనోజ్ ని అప్రోచ్ అయ్యారు. ఆ పాయింట్ మనోజ్ కి బాగా నచ్చడంతో ఓకే చెప్పి ఆ సీక్వెన్స్ చేసాడని సమాచారం. దీనికి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది.

క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి ఎఎన్ బోస్ డైరెక్టర్. స్వామి రారా ఫేం చక్రి చిగురుపతి నిర్మిస్తున్న ఈ సినిమాలో నందిని హీరోయిన్ గా కనిపించనుంది.

తాజా వార్తలు