జూన్ వచ్చేసింది.. హీరోలు రెడీ అవుతున్నారు

Published on Jun 3, 2021 1:12 am IST

లాక్ డౌన్ మూలంగా సినిమా షూటింగ్స్ నెలన్నర రోజుల నుండి నిలిచిపోయాయి. ఏ దశలో ఉన్న సినిమాలు ఆ దశలోనే ఆగిపోయాయి. హీరోలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే కేసులు సంఖ్య తగ్గుతుండటంతో సినిమా బృందాల్లో కదలిక కనబడుతోంది. ఈ నెలలో చిత్రీకరణలు రీస్టార్ట్ చేయాలని చాలామంది రెడీ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రాన్ని ఈ నెల మధ్య నుండి మొదలుపెట్టనున్నారు బోయపాటి శ్రీను. ఇక అక్కినేని నాగార్జున సైతం ఇంకొద్ది రోజుల్లో ప్రవీణ్ సత్తారు సినిమాను మొదలుపెడతారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ చేయనున్నారు.

ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ కూడ జూన్ నెలలోనే రీస్టార్ట్ కానుంది. ఇటీవలే ‘ఏక్ మినీ కథ’తో విజయం అందుకున్న సంతోష్ శోభన్ కొత్త సినిమా ఈ నెలలోనే మొదలవుతుంది. ఇవే కాకుండా ఇంకో మూడు నాలుగు చిత్రాలు ఈ జూన్ నెలాఖరులోగా మొదలవుతాయి. చాలావరకు సినిమాలు బయట షూటింగ్ చేయడం రిస్క్ కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. మోస్ట్లీ ఇంటీరియర్ షూటింగ్స్ చేయడానికే చిత్ర బృందాలు మొగ్గుచూపుతున్నాయి. సిట్యుయేషన్ చూస్తుంటే జూన్, జూలై నెలల్లో ఇండస్ట్రీలో పాత పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :