టాలీవుడ్లో షూటింగ్స్ సందడి మొదలవుతోంది

Published on Jun 15, 2021 10:02 pm IST

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దాదాపు రెండు నెలలుగా టాలీవుడ్ మూతబడిపోయింది. షూటింగ్స్ ఆగిపోయాయి, సినిమా విడుదలలు వాయిదాపడ్డాయి. వారం, పది రోజుల చిత్రీకరణ బాలన్స్ ఉన్న సినిమాలు సైతం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో షూటింగ్స్ రీస్టార్ట్ కానున్నాయి. హీరోలందరూ రెడీ కావడంతో దర్శక నిర్మాతలు షెడ్యూల్స్ వేసుకుంటున్నారు. చిన్న, పెద్ద సినిమాలన్నీ జూన్ నెలాఖరు లేదంటే జూలై మొదటి వారంలో మొదలుకానున్నాయి.

నాగ చైతన్య ‘థ్యాంక్యూ’ చిత్రం ఈ నెలాఖరున మొదలుకానుంది. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ కూడ ఈ నెల చివరి వారంలో సెట్స్ మీదకు వెళుతుంది. రవితేజ ‘ఖిలాడి’ కూడ ఈ నెలలోనే మొదలవుతుంది. నితిన్ ‘మాస్ట్రో’ ఈ జూన్ నెలలోనే మొదలవుతుంది. బాలకృష్ణ ‘అఖండ’, చిరు ‘ఆచార్య’, రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు జూలై నెలలో రీస్టార్ట్ అవుతాయి. ప్రభాస్ చేస్తున్న మూడు సినిమాలు కూడ వచ్చే నెలలోనే సెట్స్ మీదకు వెళ్తాయి. పవన్ కూడ జూలై నుండి సెట్స్ మీదకు వస్తారని తెలుస్తోంది. ఇక పదికి పైగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలు జూన్ నెలాఖరు, జూలై మొదటి వారంలో రీస్టార్ట్ కానున్నాయి.

సంబంధిత సమాచారం :