ఈ నెల మొత్తం చిన్న సినిమాలదే సందడి !

Published on Jun 6, 2019 7:53 pm IST

స్టార్ హీరోల సినిమాలన్నీ ప్రస్తుతం ఆరంభ దశలోనే, మధ్యలోనే, చివరి దశ పనుల్లోనో ఉన్నాయి తప్ప ఏదీ విడుదలకు రెడీగా లేదు. నిజానికి ఆగష్టు నెలలో విడుదలకాబోయే ‘సాహో’ తప్ప ఇప్పుడప్పుడే వేరే భారీ చిత్రం ఏదీ విడుదలకావడంలేదు. దీంతో ఈ జూన్ నెల చిన్న సినిమాలకు బాగా అనుకూలిస్తోంది. ముఖ్యంగా జూన్ నెల. పెద్ద హీరోల సందడి మొదలయ్యేలోపు తమ సినిమాల్ని రిలీజ్ చేసేయాలని చిన్న నిర్మాతలు భావిస్తున్నారు.

దీంతో ఈ జూన్ నెలలో ఈరోజు రిలీజైన హిప్పీ, సెవెన్ చిత్రాలు కానుందా దాదాపు ఇంకో 7 నుండి 8 సినిమాల వరకు థియేటర్లలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మల్లేశం, వజ్రకవచదర గోవింద, గేమ్ ఓవర్, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, విశ్వామిత్ర, కిల్లర్ రిలీజ్ డేట్లను కన్ఫర్మ్ చేసుకోగా ఓటర్, అర్జున్ సురవరం, బ్రోచేవారెవరురా, కల్కి సినిమాల విడుదల ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది. ఒకవేళ అవి కూడా కన్ఫర్మ్ అయితే ఈ నెలలో ప్రతి వారం మూడు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకురావడం ఖాయం.

సంబంధిత సమాచారం :

More