మరణం ట్రైలర్ కి మంచి స్పందన

మరణం ట్రైలర్ కి మంచి స్పందన

Published on Apr 26, 2021 8:00 AM IST

Maranam

శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రల్లో. వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం “మరణం”. కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక. ఇప్పటివరకు చిన్న చిన్న టీజర్స్ తో మిమ్మల్ని టీజ్ చేసిన మరణం టీం ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిత్ర యూనిట్. సరికొత్త కథ కథనం తో మంచి విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తో ఒక హారర్ చిత్రం వస్తే ఎలా ఉంటుంది…. మరణం ట్రైలర్ లా ఉంటుంది అంటున్నారు మన ప్రేక్షకులు.

వీర్ సాగర్ ఈ చిత్రం లో డెమోనోలజిస్ట్ అంటే ఆత్మలను బంధించే శాస్త్రవేత్త గా నటించారు. శ్రీ రాపాక తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ట్రైలర్ చూస్తుంటే ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంది. ట్రైలర్ ఇంత బాగుంటే సినిమా ఇంకా ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు సినిమా విడుదల కోసం వేచి ఉన్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు