మారుతి దర్శకత్వంలో సుప్రీం హీరో ?

మారుతి దర్శకత్వంలో సుప్రీం హీరో ?

Published on Feb 9, 2019 11:14 AM IST

‘శైలజారెడ్డి అల్లుడు’ తరువాత ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేదు మారుతి. అయితే ఈ చిత్రం తరువాత నాని తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు కానీ నాని ఇప్పట్లో ఫ్రీ అయ్యేలా కనిపిచండం లేదు. ప్రస్తుతం ఆయన జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత విక్రమ్ కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. దాంతో మారుతీ మరింత ఆలస్యం అయ్యెలాఉందని తన కొత్త చిత్రాన్ని సాయి ధరమ్ తేజ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడట.

ఇక ప్రస్తుతం సాయి ధరమ్ కిశోర్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘చిత్రలహరి’ లో నటిస్తున్నాడు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. అయితే తేజు మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యాడు. మరి ఈ చిత్రం తరువాత మారుతి తో సినిమా ను మొదలు పెడతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు