నెల రోజుల్లో సినిమా కంప్లీట్ చేయనున్న డైరెక్టర్

Published on Jun 8, 2021 5:00 pm IST

లాక్ డౌన్ మూలంగా చాలా సినిమాలు ఆగిపోయాయి. వాటిలో మారుతి, గోపిచంద్ చేస్తున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రం కూడ ఉంది. లాక్ డౌన్ నిబంధనలు తొలగుతున్న తరుణంలో అన్ని సినిమాలు మొదలుకావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ‘పక్కా కమర్షియల్’ రీస్టార్ట్ కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ముందుగా గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న ‘సీటిమార్’ ఫినిష్ చేయాలి. ఈ సినిమాకు కూడ కొద్దిపాటి వర్క్ మిగిలి ఉంది. కొన్నిరోజులు కేటాయిస్తే సినిమా కంప్లీట్ అవుతుంది.

అందుకే గోపిచంద్ ముందుగా సంపత్ నందికి డేట్స్ ఇస్తున్నారట. దీంతో మారుతి ఆ సమయాన్ని వృథా చేయకుండా కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. లాక్ డౌన్ సమయంలో రాసుకున్న కథను బయటకు తీసి సినిమా చేస్తున్నారు. ఇందులో ‘ఏక్ మినీ కథ’ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా చేస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైందట. కేవలం 30 రోజుల వ్యవధిలో షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్లిపోవాలనేది మారుతి టార్గెట్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :