మారుతి – నాని సినిమా రెగ్యులర్ షూటింగ్ డీటెయిల్స్.

మారుతి – నాని సినిమా రెగ్యులర్ షూటింగ్ డీటెయిల్స్.

Published on Jan 23, 2015 4:20 PM IST

nani-maaruthi
కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసేశాడు నాని. త్వరలో, కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మారుతి దర్శకత్వంలో నాని హీరోగా యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 5 నుండి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘బస్ స్టాప్’ ఫేం శ్రీదివ్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె కెరీర్ తమిళంలో తారాజువ్వలా దూసుకుపోతుంది. హీరో నానికు సైతం అక్కడ మంచి మార్కెట్ ఉంది. దాంతో, ఓ కొత్త తరహా వైవిధ్యమైన కథతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాత.

తాజా వార్తలు