ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకుల రోమాలు ఒక్కసారిగా నిక్క బొడుచుకుంటాయి. దానికి కారణం ఆయన స్టార్ హీరోస్ లేదా కమెడియన్ లేదా ఒక ఈగ తో సినిమానా అని లేకుండా తీసినా సినిమాలే. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెబుతున్నాను అంటే రాజమౌళి కమెడియన్ సునీల్ ని హీరోగా పెట్టి చేసిన సినిమా ‘మర్యాద రామన్న’. సలోని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.
ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో జపనీస్ లో విడుదల కానుంది. జపనీస్ కి చెందిన ఓ పోస్టర్ ని రాజమౌళి సోషల్ నెట్వర్క్ లో షేర్ చేస్తూ ‘త్వరలో జపనీస్ లో మర్యాద రామన్న విడుదల కానుందని ఇప్పుడే తెలిసిందని’ పోస్ట్ చేసారు. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా హిందీ, కన్నడ, తమిళ్, బెంగాలీ భాషలలో కూడా రీమేక్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది.
ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ సినిమా పనిలో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.


