భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో మాస్ హీరో సినిమా !
Published on Mar 8, 2018 3:11 pm IST

రవితేజ నటిస్తోన్న ‘నేల టికెట్’ సినిమా కొత్త షెడ్యూల్ రేపు రామోజీ ఫిలిం సిటిలోప్రారంభం కానుంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆద్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించబోతున్నారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

శక్తి కాంత్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

 
Like us on Facebook