ఈ కీలక సన్నివేశాల్లో మాస్ మహారాజ్.!

Published on Mar 21, 2021 2:00 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “క్రాక్”తో టాలీవుడ్ కు కొత్త సంవత్సరంలో శుభారంభం ఇచ్చి అదరగొట్టిన రవితేజ అంతే స్పీడ్ లో తన నెక్స్ట్ సినిమాలను పూర్తి చేస్తున్నారు. అలా ఇప్పుడు దర్శకుడు రమేష్ వర్మతో “ఖిలాడి” అనే చిత్రాన్ని శరవేగంగా చేస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో రవితేజ ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలను మించిన యాక్షన్ ను చూస్తారని చెప్తూ వస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగా ఈ సినిమాను సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్యనే హైదరాబద్ లో ఓ సూపర్బ్ సీక్వెన్స్ ను తెరకెక్కించిన మేకర్స్ ఇప్పుడు ఇటలీలో షూట్ఇ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇక్క బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సాంగ్ తో పాటుగా కథానుసారం వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కిస్తున్నారట. మరి ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా డింపుల్ హయతి మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే మే 28న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :