మాస్ మహారాజ్ “క్రాక్” కు మరిన్ని థియేటర్లు.!

Published on Jan 17, 2021 8:58 am IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “క్రాక్”. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే స్యూర్ షాట్ మాస్ హిట్ అయ్యింది. మరి అలాగే ఈ చిత్రం ఇప్పటికే అన్ని చోట్లా కూడా కేవలం 50 శాతం సీటింగ్ తోనే బ్రేక్ ఈవెన్ కూడా అయ్యిపోయింది.

మరి అయినప్పటికీ ఈ చిత్రం రెస్పాన్స్ మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. అన్ని వర్గాల నుంచి ఇంకా మంచి ఆదరణ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరిన్ని థియేటర్ లు పెంచుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి గాను థియేటర్లు పెరుగుతున్నాయి అట. దీనిని బట్టే అర్ధం అవుతుంది కదా మాస్ మహారాజ్ కం బ్యాక్ ఎలాంటి రీసౌండ్ వచ్చిందో అన్నది.

సంబంధిత సమాచారం :

More