మాస్ మహారాజ్ “క్రాక్” అందుకే లేట్.!

Published on Jan 26, 2021 8:00 am IST

ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదలయ్యి అన్నిటికి మించి నిజమైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మాత్రం మాస్ మహారాజ్ రవితేజనే అని చెప్పాలి. తన ఆల్ టైం హ్యాట్రిక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా “క్రాక్”. అదిరిపోయే కం బ్యాక్ అందుకోడమే కాకుండా జస్ట్ 50 శాతం సీటింగ్ తోనే భారీ వసూళ్లను రాబట్టి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ప్రతీ రోజు కూడా షోలు మరియు థియేటర్స్ పెంచుకుంటూ పోతూ మరింత స్ట్రాంగ్ గా నిలిచింది. అయితే ఇలా మరింత బలపడుతున్న సమయంలో క్రాక్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది అని వార్త వచ్చింది. తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో ఈ చిత్రం ఈ జనవరి 29నే వస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

కానీ ఫ్యాన్స్ మాత్రం అందుకు సుముఖంగా లేరు దీనితో మేకర్స్ ఈ సినిమాను ఇంకా లేట్ గా స్ట్రీమింగ్ కు తీసుకు రావాలని డిసైడ్ చేశారు. అందువల్లనే డేట్ మార్చి క్రాక్ స్ట్రీమింగ్ డేట్ ను ఫిబ్రవరి 5కు మార్చారు. ఇప్పటికీ కూడా క్రాక్ కు అద్భుత వసూళ్లు వస్తున్నాయి మరి అప్పటికి ఏమన్నా డౌన్ అయితే ఆ డేట్ కు రావడం కరెక్ట్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More