సంక్రాంతి జాతర మొదలు అంటేనే ఎక్కడ లేని హై ఎనర్జీ మన తెలుగు ఆడియెన్స్ కు వస్తుంది. గత ఏడాది కుదిపేసిన కరోనాతో పోరాడే పరిస్థితులను ఏదొకలా కంట్రోల్ తెచ్చుకుని మళ్ళీ సంక్రాంతి వైబ్స్ లోకి వచ్చేసారు. ఇక ఈ పండుగను మాత్రం మాస్ మహారాజ్ రవితేజనే గ్రాండ్ గా స్టార్ట్ చెయ్యనున్నాడు. అయితే మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం రేపు జనవరి 9 న రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా వస్తుంది.
అయితే ఇప్పటికే సాలిడ్ ప్రమోషన్స్ ఈ చిత్రానికి జరుగుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా రిజల్ట్ పరంగా కూడా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండడంతో అభిమానుల్లో కూడా అంచనాలు సమయం దగ్గరకు పడుతుండడంతో ఈ మొట్టమొదటి బిగ్ రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రవితేజా కోరుకుంటున్న సాలిడ్ కం బ్యాక్ ఈ హ్యాట్రిక్ కాంబో అందిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా ఠాగూర్ మధు నిర్మాణం వహించారు.


