మాస్ మహారాజా నుండి మాస్ అప్ డేట్ !

మాస్ మహారాజా నుండి మాస్ అప్ డేట్ !

Published on Jul 11, 2021 1:55 PM IST

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తన 68వ సినిమాని శరత్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఈ సినిమా నుండి మాస్ అప్ డేట్ రాబోతుంది అంటూ చిత్రబృందం అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

మరి మాస్ అప్ డేట్ అంటే.. కచ్చితంగా రవితేజ లుక్ కి సంబంధించిన పోస్టర్ అయి ఉండొచ్చు అని అంటున్నారు. మరి చూడాలి ఎలాంటి మాస్ అప్ డేట్ వస్తోంది. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా అక్కినేని నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన దివ్యాంశ కౌశిక్ రవితేజకి జంటగా ఈ సినిమాలో నటించబోతోంది.

మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో వస్తోన్న ఆసక్తికర హింట్స్, అండ్ అప్డేట్స్ రవితేజ అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎలాంటి టైటిల్ ను రివీల్ చెయ్యలేదు.మరి ఈ సాయంత్రం టైటిల్ కూడా రివీల్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు