ఫస్ట్ లుక్ టైమ్ ఫిక్స్ చేసుకున్న మాస్ మహారాజా !

Published on Jul 11, 2021 5:25 pm IST

మాస్ మహారాజ రవితేజ తన 68వ సినిమాని శరత్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ అవుతుంది అంటూ చిత్రబృందం అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. మరి ఫస్ట్ లుక్ అంటే.. కచ్చితంగా రవితేజ లుక్ కి సంబంధించిన పోస్టర్ అయి ఉంటుంది. మరి చూడాలి రవితేజ ఎలాంటి మాస్ లుక్ తో వస్తాడో.

ఇక ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో వస్తోన్న ఆసక్తికర హింట్స్, అండ్ అప్డేట్స్ పట్ల రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీతో ఉన్నారు. చిత్రబృందం ప్రమోషన్స్ ను కూడా విభిన్నంగా ప్లాన్ చేస్తూ వస్తోంది. ఇక అక్కినేని నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన దివ్యాంశ కౌశిక్ రవితేజకి జంటగా ఈ సినిమాలో నటించబోతోంది.

సంబంధిత సమాచారం :