బెనిఫిట్ షోస్‌తోనే సందడి చేయనున్న ‘జనతా గ్యారజ్’!

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని మరో రెండు రోజుల్లో థియేటర్ల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక పెద్ద హీరోల సినిమా అనగానే ఒకరోజు ముందుగానే బెనిఫిట్ షోస్ సందడి కనిపించడం తెలుగులో కొన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ‘జనతా గ్యారెజ్‌’కు కూడా భారీ ఎత్తున బెనిఫిట్ షోస్ ప్లాన్ చేశారు. ఆగష్టు 31న అర్థరాత్రి 1 గంటనుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో బెనిఫిట్ షోస్ ప్రదర్శితం కానున్నాయి.

ఈ షోస్‌కి సంబంధించి నిర్వాహకులు ఇప్పటికే సంబంధిత అధికారుల ద్వారా అనుమతి తీసుకున్నారు. ముందునుంచీ ప్లాన్ చేసినట్లే పెద్ద ఎత్తున బెనిఫిట్ షోస్ ఉండనున్నాయని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉండగా, మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయే స్థాయిలో ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.