విజయ్ “లియో” కి భారీ డీల్స్ కానీ..!

Published on Mar 2, 2023 2:00 pm IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “వారిసు” తో తన కెరీర్ లో మరో పెద్ద హిట్ ని అయితే తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి మరొక చిత్రం “లియో” ని అయితే అనౌన్స్ చేసి దానిపై ఎనలేని హైప్ ని సెట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాని దర్శకుడు లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ అయితే కాశ్మీర్ లో జరుగుతుంది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఆల్రెడీ 400 కోట్ల రికార్డు బిజినెస్ జరిగిందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సినిమాకి ఓవర్సీస్ లో కూడా భారీ ఆఫర్స్ తో డీల్స్ వస్తున్నాయట. కానీ మేకర్స్ అయితే ఇప్పుడప్పుడే వీటిని ఫైనల్ చేయాలి అనుకోవట్లేదట. సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ టైం లో ఈ డీల్స్ ని ఫైనల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనితో ఈ మాసివ్ ఆఫర్స్ అప్పటికి మరింత ఎక్కువ అవుతాయని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :