తన “అర్జున్ రెడ్డి” సినిమాతో ఒక్కసారిగా నేటి తరం యువతకు యూత్ ఐకాన్ గా మారిపోయిన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. అక్కడ నుంచి తన క్రేజ్ ను పదిలంగా మరింత స్థాయిలో పెంచుకుంటూ వచ్చాడు. అలాగే ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ లో కూడా భారీ ఫాలోయింగ్ ను విజయ్ దక్కించుకున్నాడు.
అలా లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని కోటి మంది రౌడీ ఫ్యాన్స్ తో మరోసారి సెన్సేషన్ నే సృష్టించాడు. ఇది మాత్రం మామూలు విషయమేమీ కాదని చెప్పాలి.
ఇక అలాగే ఈ హీరో మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఒక అదిరిపోయే యాక్షన్ ఎంటెర్టైనెర్ “ఫైటర్” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరో టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణతో కూడా విజయ్ ఓ సినిమాను ఓకే చేసి దానితో పాటుగా మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తో కూడా రెడీ అవుతున్నాడు.


