పోలీస్ స్టేషన్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘యు టర్న్’ !

పోలీస్ స్టేషన్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘యు టర్న్’ !

Published on Jun 20, 2018 9:25 AM IST

వరుస విజయలతో తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి సమంత అక్కినేని. ఆమె ప్రస్తుతం’ యు టర్న్’ అనే చిత్రంలో నటిస్తోంది. 2106 లో కన్నడలో ఘన విజయం సాధించిన ‘యు టర్న్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన పవన్ కుమారే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు .

ఇక ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పోలీస్ స్టేషన్ సెట్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో సమంత తో పాటు, అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ తదితరులు పాల్గొంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని త్వరలోనే విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు