“మాస్టర్” నటికి కరోనా పాజిటివ్.!

Published on May 6, 2021 1:00 pm IST

ప్రస్తుతం కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఈ సెకండ్ వేవ్ మూలాన మళ్ళీ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ నటులే కరోనా బారిన పడుతున్నారు. అలా లేటెస్ట్ గా ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ నటి ఆండ్రియా జెరెమియా కోవిడ్ బారిన పడినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో తగు జాగ్రత్తలు తీసుకొని ఐసోలేషన్ లో ఉందట. ఇక ఆండ్రియా లేటెస్ట్ గా ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన భారీ చిత్రం “మాస్టర్” లో కనిపించి అలరించింది. అలాగే మన తెలుగు ఆడియెన్స్ కి అయితే హీరో కార్తీతో చేసిన యుగానికి ఒక్కడు సినిమాతో బాగా సుపరిచితం. మరి ఆమె త్వరగా కోలుకోవాలని మా 123తెలుగు టీం తరపున ఆకాంక్షిస్తున్నాము.

సంబంధిత సమాచారం :