చరణ్ సరసన ‘మాస్టర్’ హీరోయిన్ ?

Published on Jun 5, 2021 11:45 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. చరణ్ శంకర్ కాంబినేషన్ తొలిసారి కావడంతో అందరిలోనూ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ పుట్టుకొస్తోంది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. మాళవిక మోహనన్ నే దాదాపు ఖాయం అయ్యేలా ఉంది. శంకర్ ఎక్కువుగా ఖాళీగా ఉన్న మీడియం రేంజ్ హీరోయిన్లనే తన సినిమాల్లో తీసుకుంటాడు కాబట్టి, మాళవికకు భారీ ఆఫర్ వచ్చినట్టే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఉండబోతోంది ఈ ప్రాజెక్ట్.

అయితే శంకర్ ‘ఇండియన్-2’ను పూర్తిచేసే బయటకు రావాల్సి ఉంటుంది. అప్పుడు చరణ్ సినిమాకు తాత్కాలికంగా బ్రేకులు తప్పవు.

సంబంధిత సమాచారం :