“మాస్టర్” చార్ట్ బస్టర్ మరో సెన్సేషనల్ రికార్డ్.!

Published on Jun 18, 2021 8:02 pm IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సాలిడ్ విలన్ రోల్ లో నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్”. ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదల కాబడిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా కమెర్షియల్ గానే కాకుండా మ్యూజిక్ పరంగా కూడా భారీ హిట్ అయ్యింది.

అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఆల్బమ్ లో “వాతి కమింగ్” సాంగ్ అయితే ఎల్లలు చెరిపేసి అతి పెద్ద హిట్ అయ్యింది. మరి ఈ వీడియో సాంగ్ ఇప్పుడు మరో భారీ రికార్డును అందుకుంది. జస్ట్ ఈ కొన్ని నెలల్లోనే ఈ సాంగ్ 200 మిలియన్ భారీ వ్యూస్ అందుకొని మరో రికార్డు సెట్ చేసింది. మరి ఇప్పుడు మళ్ళీ విజయ్ మరియు అనిరుద్ కాంబో నుంచి మరో సాలిడ్ చిత్రం కూడా రెడీ అవుతుంది. ఇక దాని ఆల్బమ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :