ఒక్క మాటలో బన్నీ ఎలాంటివాడో చెప్పిన “మాస్టర్” విలన్!

Published on Feb 19, 2021 9:21 am IST

మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాను చేసే స్టైలింగ్ కు కానీ అలాగే డాన్స్ లకు గాని ఎలాంటి క్రేజ్ పాన్ ఇండియన్ లెవెల్లో సంపాదించుకున్నాడో తెలుసు. మరి అలాగే తన హార్డ్ వర్క్ తోనే బన్నీ చాలా సెలెబ్రెటీలలో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే లేటెస్ట్ గా మాత్రం “మాస్టర్” విలన్ బన్నీ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

మాస్టర్ విలన్ అంటే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాదు. ఆ పవర్ రోల్ కు చిన్నప్పటి రోల్ లో కాసేపే కనిపించినా మంచి ఇంపాక్ట్ రాబట్టిన బాలనటుడు మహేంద్రన్. అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రన్ ను మాస్టర్ లో చేసిన రోల్ చూసి అంతా ఆశ్చర్య పోయారు.

మరి ఇపుడు ఇతడు బన్నీ పై సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ అతని కోసం ఒక మాట చెప్పమనగా “బన్నీ చాలా సిన్సియర్, సింపుల్ అండ్ హార్డ్ వర్కింగ్ హీరో అని అంతే కాకుండా బన్నీ నా ఫేవరెట్ డాన్సర్” అని కూడా ఈ యంగ్ నటుడు తెలిపాడు. దీనితో ఈ కామెంట్ బన్నీ ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More