మరోసారి ‘మాతృదేవోభవ’.. నయనతారతో ?

Published on Apr 27, 2021 1:30 am IST

1993లో విడుదలైన ‘మాతృదేవోభవ’ చిత్రం ప్రేక్షకుల మీద చూపిన ప్రభావం చాలా గొప్పది. చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటికీ టీవీల్లో సినిమా వస్తుందంటే చూసేవాళ్ళకు నోట మాట రాదు. విడుదలైనప్పుడు సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఉందో ఇప్పటికే అది అలానే ఉందని అంటుంటారు ఆనాటి ప్రేక్షకులు. అంతలా అమ్మ ప్రేమలోని గొప్పతనాన్ని చాటిచెప్పింది ఈ చిత్రం. మాధవి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను కె.ఎస్. రామారావుగారు నిర్మించగా కె.అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.

ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కె.ఎస్.రామారావుగారు ఆ సినిమాకు రీమేక్ చేయాలని ఉందని అన్నారు. అంతేకాదు దీన్ని కూడ అజయ్ కుమార్ డైరెక్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఈతరం నటీమణుల్లో నయనతార అయితే తల్లి పాత్రకు సరిగ్గా సరిపోతుందని చెప్పుకొచ్చారు. కానీ రెమ్యునరేషన్ విషయంలోనే కంగారుపడాల్సి వస్తోందని అన్నారు. మరి ఆయన అన్నట్టు నిజంగానే ‘మాతృదేవోభవ’ను గనుక రీమేక్ చేస్తే గొప్ప సినిమా రీక్రియేట్ అయినట్టే.

సంబంధిత సమాచారం :