“ఆదిపురుష్”లో ఈ బాలీవుడ్ నటుడు ఫిక్స్ లానే ఉన్నాడు.!

Published on May 28, 2021 10:00 pm IST

ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ఇతిహాస చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రలకు సంబంధించి గత కొంత కాలం నుంచి హాట్ టాపిక్స్ వినిపిస్తూ వస్తున్నాయి.

మరి ఆ టాపిక్ ప్రకారం బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సిద్దార్థ్ శుక్లా నటిస్తున్నాడని తెలిసింది. కానీ ఆ టాక్ లో ఎంత వరకు నిజముందో కానీ అతని లేటెస్ట్ లుక్స్ చూస్తే కన్ఫర్మే అనిపిస్తుంది. తాను ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో అతన్ని చూస్తే అర్ధం అవుతుంది ఆ మీసం కట్టు అంతా కొత్తగానే ఉంది మరి.. సో ఇదంతా చూస్తుంటే ఈ యువ ఉన్నాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :