విజయ్ దేవరకొండ సేఫ్

Published on Nov 5, 2019 6:54 pm IST

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి నిర్మించిన మొదటి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పూర్తిస్థాయి నటుడిగా మారారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ దేవరకొండ క్రేజ్ మూలాన మొదటి మూడు రోజులు పర్వాలేదనే వసూళ్లు రాబట్టుకుంది.

నిర్మాత విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన అన్నారు. సినిమాను తక్కువ ధరలకే అమ్మారు కూడా. కానీ డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని మంచి ధరకే అమ్మినట్టు సమాచారాం. సో.. దేవరకొండకు ఈ ప్రాజెక్ట్ సేఫ్ వెంచర్ అనే అనాలి. ఇక బయ్యర్ల విషయానికొస్తే అధికారిక లెక్కల మేరకు మూడు రోజులకు చిత్రం రూ.4.05 కోట్ల గ్రాస్ రాబట్టింది. కానీ సోమవారం డీలా పడింది. బయ్యర్లు చెప్పుకోదగిన లాభాలు చూడాలంటే సినిమాకు ఈ శుక్రవారం వరకు ఒక మాదిరి ఆక్యుపెన్సీ అయినా ఉండాలి. మరి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :