మీకు మాత్రమే చెవుతా ఫస్ట్ లుక్ చూశారా…!

Published on Aug 30, 2019 2:59 am IST

సెన్సషనల్ హీరో దేవరకొండ నిర్మాతగా మారాడు. ది కింగ్ అఫ్ హిల్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ స్థాపించి మొదటి చిత్రంగా మీకు మాత్రమే చెవుతా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించాడు. అలాగే ఈ చిత్రంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తున్నట్లుగా హింట్ ఇచ్చారు. కాగా నేడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

పోస్టర్ లో తరుణ్ తో పాటు ఉన్న ఇద్దరు మిత్రులు మొబైల్ చెవిలో పెట్టుకొని ఊహించని వార్త విని, నోరెళ్ళ బెట్టినట్లున్న ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. టైటిల్ కి మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్ అని ట్యాగ్ కూడా ఉంది. ఈ చిత్రాన్ని కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తారనిపిస్తుంది. కాగా ఈ చిత్రానికి సమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :