హాట్ సీట్‌లో రామ్ చ‌ర‌ణ్‌తో ఎన్టీఆర్ సందడికి డేట్ ఫిక్స్..!

Published on Aug 13, 2021 2:07 am IST

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ “ఆర్ఆర్ఆర్”లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అక్టోబ‌ర్ 13న వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న ఈ ఇద్దరి కాంబో త్వరలోనే స్మాల్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-1కి హోస్ట్‌గా చేసి మెప్పించిన ఎన్టీఆర్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మరోసారి బుల్లితెర ప్రేక్షకుల మనసులను గెలుచుకునేందుకు “మీలో ఎవరు కోటీశ్వరులు” షో ద్వారా వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్ప‌టికే ఈ షోకి సంబంధించి ప‌లు ప్రోమోలు విడుద‌ల కాగా, ఆగస్టులో ఈ షోను టెలికాస్ట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తొలి ఎపిసోడ్‌లో హాట్‌సీట్‌లో రామ్ చ‌ర‌ణ్‌తో ఎన్టీఆర్ సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆగస్టు 15న మొదటి ఎపిసోడ్‌ను ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారని సమాచారం. ఈ ఎపిసోడ్‌కి సంబంధించి మరికొద్ది గంటల్లోనే అఫిషీయల్‌గా ప్రోమోను విడుదల చేయబోతునట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరి కాంబో స్మాల్ స్క్రీన్‌పై ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :