మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రానున్న సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ నటించబోతుందని ఇప్పటికే అనేక రూమర్స్ వినిపించాయి. అయితే ఈ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ ప్లాష్ బ్యాక్ లో వస్తోందని.. సీనియర్ బాలయ్య పాత్రకు భార్య పాత్రలో మాజీ హీరోయిన్ మీనాను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మీనాది హీరోయిన్ పాత్ర కాకపోయినా ఒకరకంగా సెకెండ్ హీరోయిన్ పాత్ర అనుకోవచ్చు.
కాగా ఈ సినిమాలో బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. గుండుతో ఉన్న రోల్ తో పాటు ఫుల్ మీసంతో వైట్ అండ్ వైట్ గెటప్ లో మరో రోల్. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.


