25 ఏళ్ల తరవాత కమల్ సరసన మీనా ?

Published on Jun 17, 2021 3:01 am IST

విశ్వనటుడు కమల్ హాసన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో సగం పూర్తైన శంకర్ ‘ఇండియన్-2’ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయాల్సిన ‘విక్రమ్’ మొదలవ్వడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. దీంతో ఆయన మలయాళ చిత్రం ‘దృశ్యం-2’ను ‘పాపనాశనం-2’ పేరుతో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక చికొచ్చి పడింది. అదేమిటంటే ‘పాపనాశనం’లో కమల్ సరసన గౌతమి కథానాయికగా నటించారు. కథ ప్రకారం అయితే ఈ సీక్వెల్ రీమేక్లో కూడ ఆమే నటించాలి. కానీ కొన్నేళ్ల క్రితం కమల్, గౌతమి వైవాహిక బంధం నుండి వేరుపడటం జరిగింది.

కాబట్టి వీరిద్దరూ కలిసి నటించే వీలు లేదు. అందుకే కమల్ ఒరిజినల్ వెర్షన్లో, తెలుగు రీమేక్ ‘దృశ్యం-2’లో నటించిన మీనాను కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారట. దర్శకుడు జీతూ జోసెఫ్ కూడ అందుకు సుముఖంగానే ఉన్నారట. పైగా మీనా తమిళంలో మంచి పేరున్న నటి. కాబట్టి సినిమాకు కూడ కలిసొస్తుంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే మీనా పాతికేళ్ల తరవాత కమల్ హాసన్ సరసన నటించినట్టు అవుతుంది. గతంలో కమల్, మీనాలు కలిసి 1996లో ‘అవ్వై షణ్ముఖి’ చిత్రంలో నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :