టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ తన కెరీర్ 158వ సినిమాగా దీనిని చేస్తుండగా అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే మూమెంటంలో మేకర్స్ షూట్ ని కూడా ఫుల్ స్వింగ్ లో పూర్తి చేస్తున్నారు.
రీసెంట్ గానే మొదటి షెడ్యూల్ ని పొలాచిలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా శరవేగంగా పూర్తి చేసేసినట్టు ఖరారు చేసారు. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా వదిలి మెగాస్టార్ ని ఎక్కడా రివీల్ చేయకుండా షెడ్యూల్ ని పూర్తి చేసినట్టు తెలిపారు. అంతే కాకుండా ఈ షెడ్యూల్ ఒక విస్ఫోటనం అంటున్నారు.
ఇక ఈ షెడ్యూల్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ అనేది కూడా రివీల్ చేసారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టు కన్ఫర్మ్ చేసారు. ఇది కూడా అతి త్వరలోనే మొదలు కానుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.
POLLACHI ☑️
HYDERABAD Begins ⏳Can’t wait for you to experience it on the big screens ❤️🔥#Mega158 #ChiruBobby2 – THE BLOODY BENCHMARK 🪓
Produced by #VenkatKNarayana @KvnProductions#AnaswaraRajan @Nivetha_Tweets @MusicThaman @vijaykartikdop @AntonyLRuben @artkolla… pic.twitter.com/hvVTFCiDcG
— Bobby (@dirbobby) June 22, 2026


