మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!

మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!

Published on Aug 18, 2026 11:05 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన కెరీర్ 158వ సినిమా కూడా ఒకటి. దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేస్తుండగా మేకర్స్ సినిమా టైటిల్ టీజర్ కి ఎప్పుడో ముహుర్తాన్ని లాక్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ సినిమా తాలూకా టైటిల్ టీజర్ ని రివీల్ చేస్తున్నట్టు ఖరారు చేయగా దీనికి భారీ ప్లానింగ్ లు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ పుట్టినరోజు నాడు అంటే ఆగష్టు 22న థియేటర్స్ లో సినిమా టైటిల్ టీజర్ ని విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

సినిమాపై ఆల్రెడీ భారీ అంచనాలు ఉన్నాయి. వాటికీ తగ్గట్టుగానే ప్లానింగ్ లు కూడా పక్కాగా నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. సో ఈసారి కూడా వాల్తేరు వీరయ్య కాంబినేషన్ దుమ్ము లేపుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు