ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్న అవైటెడ్ యాక్షన్ సీక్వెల్ చిత్రం ‘సలార్ 2’ కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో కొంచెం షూట్ ఆల్రడీ పూర్తి చేశారు. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది.
మేకర్స్ ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సో సలార్ 2, 2027 లో మిగతా షూట్ ని పూర్తి చేసుకోనుంది అని చెప్పవచ్చు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ డ్రాగన్ రెండు భాగాలూ పూర్తి చేసేస్తారా లేదా అనేది చూడాలి. ఇక సలార్ 2 లో పృథ్వీరాజ్, శృతి హాసన్ తదితరులు నటించగా హోంబళే ఫిల్మ్స్ నిర్మాణం వహిస్తున్నారు.


