యువ హీరో కు జోడిగా మెగా ఆకాష్ !

యువ హీరో కు జోడిగా మెగా ఆకాష్ !

Published on Mar 20, 2019 8:47 AM IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ లవర్ తరువాత కొంత గ్యాప్ తీసుకొని తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ‘అడుమగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణా రెడ్డి తెరకెక్కించనున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ మెగా ఆకాష్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

ఈ చిత్రానికి ‘నీది నాది ఒకటే లోకం’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు