మండలి బుద్ధ ప్రసాద్ కొడుకు పెళ్లి వేడుక లో మెగా బ్రదర్స్

Published on Oct 24, 2021 11:00 pm IST

రాజకీయ నాయకులు, మరియు సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు తరచూ పలు కార్యక్రమాల్లో కలవడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మెగా బ్రదర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లు ఇద్దరు కూడా రాజకీయ నాయకులు అయిన మండలి బుద్ధ ప్రసాద్ గారి కొడుకు పెళ్లి వేడుకకు హాజరు అయ్యారు. ఈ వేడుక లో మెగా బ్రదర్స్ కలిసి ముచ్చటించడం జరిగింది.

ఈ వేడుక లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటికి రావడం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా బ్రదర్స్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో పూర్తి గా బిజిగా ఉండగా, పవన్ కళ్యాణ్ ఇటు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, రాజకీయాల్లో కూడా యాక్టిివ్ గా ఉంటున్నారు.

సంబంధిత సమాచారం :