అందరూ మరచినా..చిరు ఫ్యాన్స్ వారిని గుర్తుపెట్టుకున్నారు.

Published on Jul 1, 2020 1:48 pm IST

వచ్చే నెలలో మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ ఉంది. అది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆగస్టు 22 న మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో ఇప్పటి నుండే వారు ప్రణాళికలు మొదలు పెట్టారు. దాదాపు పదేళ్లుగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం మెగా హీరోల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా మెగాస్టార్ పుట్టినరోజు ఘనంగా జరపాలని సదరు అభిమాన సంఘం నిర్ణయించింది.

కాగా ప్రతి ఏటా చిరు పుట్టినరోజు నాడు అనేక సేవాకార్యక్రమాలు చేసి, పేదలను ఆదుకొనే ఈ అభిమాన సంఘ సభ్యులు, ఈసారి థియేటర్స్ కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించారట. మూడు నెలలకు పైగా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూత పడగా, ఆ పరిశ్రమపై ఆధారపడిన చిరుద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారు. దీనితో థియేటర్స్ కార్మికులను ఆదుకొని వారికి సాయం చేయాలని నిర్ణయిచుకున్నారు. ఈ మేరకు వారు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. చిత్ర పరిశ్రమ ప్రముఖులు సైతం సినీ కార్మికులకు సాయం చేశారు కానీ థియేటర్ కార్మికుల గురించి ఆలోచించలేదు.

సంబంధిత సమాచారం :

More