
మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు తనయుడుగా తెలుగు తెరకి హీరోగా పరిచయమైన ఆరడుగుల యంగ్ హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన మూడవ సినిమా ‘లోఫర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై మొదటి వారంలో లాంచ్ చేసి ఏ మాత్రం గ్యాప్ లేకుండా సెట్స్ పైకి తీసుకెళ్ళి రెగ్యులర్ గా షూటింగ్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లో ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం సెకండ్ షెడ్యూల్ ని రాజస్థాన్ లో షూట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జైసల్మీర్ లో షూట్ చేసిన ఈ చిత్ర టీం మళ్ళీ జోద్పూర్ కి చేరుకుంది.
ప్రసతుతం జోధ్పూర్ లో వరుణ్ తేజ్ మరియు మరియు కొంతమంది పిల్లలపై ఓ పాటని షూట్ చేస్తున్నారు. ఈ పాటని రాజస్థానీ స్టైల్ లో షూట్ చేస్తుండడం విశేషం. వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్ దిశా పటాని కూడా షూట్ లో పాల్గొంటోంది. ఈ సినిమాలో మేజర్ పార్ట్ ని రాజస్థాన్ లోనే షూట్ చేయనున్నారు. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. తన మూడవ సినిమా షూటింగ్ ని శరవేగంగా ఫినిష్ చేస్తున్న వరుణ్ తేజ్ తన రెండవ సినిమా ‘కంచె’ షూటింగ్ ఫినిష్ చేయడమే కాకుండా రిలీజ్ కి సిద్దం చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

