ఆ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన మెగాహీరో..!

Published on Jun 23, 2022 7:09 am IST

‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ఆ తర్వాత ‘సాహో’ సినిమా చేయగా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఆ మూవీని డైరెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ సుజీత్‌పై ఆ నెగిటివిటీ గట్టిగానే పడింది. అందుకే ఇంతకాలం సుజీత్ మరో సినిమాను తెరకెక్కించలేదు.

అయితే సాహో తర్వాత ఇంతకాలం ఖాళీగా ఉన్న సుజీత్‌కు ఓ మెగా హీరో ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ‘ఎఫ్ 3’ చిత్రంతో కామెడీ హిట్‌ను అందుకున్న వరుణ్ తేజ్.. త్వరలోనే సుజీత్‌తో ఓ సినిమా చేయనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ మూవీ తర్వాత వరుణ్, సుజీత్ మూవీ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :