మెగా హీరోకు జోడీగా నాని హీరోయిన్ ?

16th, February 2018 - 04:00:57 PM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో చంద్రశేఖర్ ఏలేటి చిత్రం కూడా ఒకటి. చర్చల దశలో ఉన్న ఈ సినిమా దాదాపు కుదిరినట్టేనని అంటున్నారు. ఈ చిత్రంలో తేజ్ కు జోడిగా రుక్సార్ మీర్ ను పరిశీలిస్తున్నారట. రుక్సార్ మీర్ గతంలో ‘ఆకతాయి’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.

అంతకు ముందే ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో ఆమె చేసిన ‘షో టైమ్’ చిత్రీకరణ పూర్తైనా ఇంకా విడుదలకాలేదు. ప్రస్తుతం ఈమె నాని, మేర్లపాక గాంధీల ‘కృష్ణార్జున యుద్ధం’లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే వరుస పరాజయాల తర్వాత తేజ్ చేయనున్న ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది, సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.