మరో సినిమాను మొదలుపెట్టనున్న మెగా హీరో !

Published on May 28, 2018 11:13 am IST

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే కరుణాకరన్ యొక్క ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రీకరణను ముగించారు. దీని తరవాత ఆయన ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మొదలుకానుంది. ఇది కాకుండా మరో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారట తేజ్.

ఆ కొత్త సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తారట. జూలైలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తారట. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గోపీచంద్, తేజ్ లు కలిసి గతంలో ‘విన్నర్’ సినిమాను చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :