స్టార్ హీరోలకు కేర్ ఆఫ్ అడ్రెస్ మెగా ఫ్యామిలీ. చిరంజీవి నిర్మించిన ఆ సామ్రాజ్యంలో పవన్ కళ్యాణ్, చరణ్ మరియు అల్లు అర్జున్ లో స్టార్ హీరో హోదా అందుకున్నారు. అలాగే ధరమ్ తేజ్ మరియు వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్ హీరోలుగా దూసుకెళుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చి ఫెయిల్ అయినవారు ఒకరిద్దరు మాత్రమే. కాగా యంగ్ మెగా హీరోలందరూ కలిసి ఉన్న త్రో బ్యాక్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో బన్నీ , చరణ్, ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మరియు నిహారిక కూడా ఉన్నారు. టీనేజ్ లో ఉన్న మెగా హీరోల లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇక ఈ మెగా హీరోలందరూ వారివారి సినిమాలలో బిజీగా ఉన్నారు. చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తుండగా, బన్నీ దర్శకుడు సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్నారు. ఇక వరుణ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ బాక్సింగ్ బేస్డ్ మూవీ చేస్తున్నారు. ధరమ్ తేజ్ నూతన దర్శకుడు సుబ్బుతో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నారు.


