కృష్ణా జిలాల్లో మెగా హీరోల సినిమాలు ఎలా ఆడుతున్నాయంటే !

12th, February 2018 - 01:39:36 PM

మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ఇంటిలిజెంట్’, వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రాలు వరుసగా ఈ నెల 9, 10 వ తేదీల్లో రిలీజైన సంగతి తెలిసిందే. వీటిలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన ‘తొలిప్రేమ’ మంచి టాక్ ను సొంతం చేసుకుని హిట్ దిశగా సాగిపోతూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి మంచి పట్టుకున్న కృష్ణా జిల్లా ఏరియాలో ఈ చిత్ర వసూళ్ల వివరాలను చూస్తే ‘తొలిప్రేమ’ 2న రోజు రూ.28.26 లక్షలతో మొత్తంగా రూ.52.51 లక్షల షేర్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే ‘ఇంటిలిజెంట్’ 3వ రోజు రూ.3.56 లక్షల షేర్ తో నిన్నటి వరకు రూ. 18. 08 లక్షల షేర్ ను వసూలు చేసింది.