ఈ దురదృష్ట ఘటన నన్ను ఎంతగానే బాధ పెట్టింది – రామ్ చరణ్

Published on Sep 19, 2018 12:07 pm IST

మిర్యాలగూడలో జరిగిన కులహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణం పై ఇప్పటికి రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘ నాయకులు స్పందించారు. కాగా ఇప్పటికే ప్రణయ్‌ హత్యను మంచు మనోజ్‌, రామ్ లాంటి యంగ్ హీరోలు కూడా ఈ హత్యని చాలా తీవ్రంగా ఖండించారు. తాజాగా రామ్‌ చరణ్‌ కూడా ఈ నీచ ఘటన పై తన స‍్పందనను తెలియజేసారు.

రామ్ చరణ్ పోస్ట్ చేస్తూ.. ‘పరువు పోతుందని ప్రాణం తీసిన ఈ దురదృష్ట ఘటన నన్ను ఎంతగానే బాధ పెట్టింది, మనిషి ప్రాణం తీస్తే పరువు వస్తుందా..? ఈ సమాజం ఎటు పోతుంది..? ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు, అమృత వర్షిణికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రణయ్‌ కి న్యాయం జరగాలి’ అని తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేసారు.

సంబంధిత సమాచారం :